Saturday, April 12, 2008

America lo Americanlaa rendu rojulu ..

రోం లో రోమన్ లా ఉండాలి అని ఒకరిద్దరు సలహా ఇచ్హారు. ఇదేదో నచ్హినట్లు అనిపించింది.. ప్రయత్నిద్దామనుకున్నా..! మొత్తం నెలంతా కాదనుకోండి .. కేవలం రెండు రోజులు .. !రెండురోజులకే విసుగొచ్హింది .. ఇంతకి విషయమేమిటంటే .. ఈ శనివారం లాస్ వెగాస్ వెల్లాం .. నన్నడిగితే ప్రతి ఒక్కరు జీవితం లో ఒక్కసారయినా అక్కడికెల్లాలి అని చెబుతాను .. ఊరు అంత అద్భుతంగా ఉంది .. అక్కడ ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉన్నాయి .. నన్నడిగితే అదో వింత ప్రపంచం .. మనుషులతో మొదలై క్లబ్బులవరకూ అన్ని విచిత్రంగనే ఉన్నాయి. మరి నాకొకనికే అలా అనిపించాయో లేక అందరికీ అలానే అనిపించిందో తెలియదు కాని .. కొన్నింటిని చెబుతానుప్రపంచంలో ఏడు వింతలు అక్కడ మీరు చూడొచ్హు .. ఇంక ఎనిమిదో వింత అక్కడికెల్లే మనుషులు .. పాపం ఒకరైన వంద డాలర్లు సంపాదించారో లేదో ఆ దేవుడికే తెలియాలి .. అశ మనిషిని ఎక్కడికైన తీసుకెల్తుంది అన్న సామెత విని ఆ ప్రదేశం ఎక్కడ అనుకొనే వాన్ని .. తీర ఇప్పటికి తెలిసింది ..ఇంకొ విచిత్రమంటారా .. ఇక్కడ జూదం అదటానికి వచ్హే వాల్లలొ పదహరేల్ల పడచు పిల్లలూ ఉన్నారు, ఎనిమిది పదులు దాటిన ముసలవ్వలూ ఉన్నారు. నూనూగు మీసాలా వయసులో జీవితాశయాల్ని పక్కనపెట్టి ఒక చేతిలో సిగరెట్టు మరో చేతిలో మందు గ్లాసు పట్టుకుని జూదమాడటం ఇక్కడ కుర్రకారు రేయనక పగలనక చేసే పని .. ఎదో సాదిద్దమని అక్కడకొచ్హి చేతులు కాల్చుకుని ఇక్కడికెందుకొచ్హామ అని అలొచించేలొపే తెల్లవారి బట్టలు సర్దుకొని ఊరికి బయలుదేరేటం ఇక్కడకొచ్చే జనాల దినచర్య.
ఇక నా విశయానికి వస్తే .. నేను వాల్లలాగ ఏదో సాదిద్దామని అక్కడికి వెల్లక పొయినా .. వెల్లే ముందు నాలొ ఎక్కడో చిన్న సందిగ్దం .. అక్కడ ఏం ప్రత్యేకత ఉందో తెలుసు కోవాలన్న కోరిక .. రెండు వారల ముందు నుండి ప్లాన్స్ వేసి వేసి అలసి పొయాం .. తీర ఆరోజు రానే వచ్చింది.
ఎప్పుడు ఆఫీసుకు వెల్లదనికి ఎనిమిది గంటలకైన నిద్ర లేవని మేము ఉత్సాహంగ అయిదింటికే నిద్ర లేచి విమానాశ్రయానికి బయలుదేరం .. ఇక్కడ విమానశ్రయల్లొ జనాలు మన కడప బస్సు స్టాండు లో లా ఉన్నారు .. ఇది నాకు కొత్తేమోకాని .. నాతో పాటు వచ్చిన జనాలకు అలా అనిపించలేదంట ..
మా కలల ప్రపంచం లాస్ వెగాస్ రానె వచ్చింది .. ( నా సొంత దబ్బులు వెచ్చించి చేసిన తొలి విమానయానమిదే నా జీవితం లో ..) ఆ ఊరిని చూడగనే భూలోకానికీ ఆ ప్రదేశానికి చాలా దూరం ఉన్నట్లు అనిపించింది.
మొదటి మెట్టు .. మేము దిగిన హోటెల్.. నేను నాజీవితం లో ఎప్పుడు నా స్వంత డబ్బులతో అయిదు నక్షత్రాల హోటెల్ లొ దిగుతానని కల కూడా కనలేదు .. ఈ రెండు రోజులూ తీసేస్తే బహుషా అది నిజమే కావచ్చు కూడా .. 25 అంతస్తులతో సర్వాంగ సుందరంగ ఉందా హోటెల్ .. దాన్ని చూసి మొదట మనం బుక్ చేసిన హోటెల్ ఇది అయ్యుండదేమో అనిపించింది .. ఎందుకంటే నలుగురు సాఫ్ట్ వేరు ఇంజినీర్లు సుమారు రెండు గంటలు వెచ్చించి వివిధ రకాల అలోచించి చించి వెతికి వెతికి చివరకు చౌక అని సర్టిఫై చేస్తే బుక్ చేసిన హోటెల్ ఇది .. కాబట్టి నేనేదో అదొక గుడిసె లా ఉంటుందనుకున్నాను కాని తీరా అక్కడ చూస్తే అదొ అయిదు నక్షత్రాల హోటెల్.
ఇక్కడే మొదలయ్యింది మా లాస్ వెగాస్ ప్రస్థానం .. మొదటి అంతస్తులో ఒక పెద్ద ఈత కొలను .. జూదమాదటానికి సుమారు 90000 చదరపు అడుగుల విశాల స్థలం .. అక్కడకు వచ్చిన అథిదులకు సేవ చెయడానికి అర్థ నగ్న దుస్తుల్లో అందమైన అతివలు .. ఈ దృశ్యం చూడగానే మన పాత సినిమాల్లో దృష్యాలు నా కల్లలో మెదిలాయి. ఇదా మనం కలలు కన్న వింత ప్రపంచం అని నమీద నాకే అసహ్యం వేసింది ..
దీంతో మొదలయిన ఆ అసహ్యం ఆ ఊరు విదిచేదాక వదల్లెదు ..
అక్కడ ప్రతి హోటెల్ చూడటానికి చాల అద్భుతంగా ఉంటుంది తీరా అక్కడికెల్లి చూస్తే ఎక్కడ చూసినా జూదం జూదం జూదం .. రెండో పదం కనబడదు .. ఇక రోడ్ మీద నడవాలన్న ఎక్కడ చూసినా మన ఊర్లో దినపత్రికలు కూరగాయలు అమ్మినట్లు అమ్మాయిల చిత్రాలు అమ్ముతున్నారు .. అవి ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకునే సాహసం చెయ్యలేదు మేము.
అక్కడ రోడ్ మీద నదిచే జనాలు .. ఎవరిని అకర్షించడానికో తెలియదు కాని .. చిత్ర విచిత్ర దుస్తుల్లో దర్షనమిచ్చారు .. మరి వీల్లంతా మాలాగ చూడటానికొచ్చారో లేక ఈ ఊర్లో జనలే ఆంతో నాకైతే అర్థం కాలేదు .
రెండు రోజులు అమెరికాలో అమెరికన్ లా బ్రతకదమంటే ఇదేనేమో ..
ఇక చివరి ఘట్టం తిండి .. రెండు రోజులూ పూర్తిగా అమెరికన్ లా తినాలని కూడ భావించి .. రోజూ తినే అన్నానికి గుడ్ బై చెప్పి అమెరికన్లలా గడ్డి తినదానికి రెడీ అయ్యాను .. ఇలా నిర్ణయం తీసుకొనేముందు అలోచించుంటే బాగుండేదేమో .. ఎక్కడా పచ్చి మంచినీల్లు దొరికితే ఒట్టు .. మధ్య పానం మాత్రం కారు చౌకగా దొరికేలా అనిపించింది కాని ఏం ప్రయోజనం .. అతి కష్టం మీద ఫుట్ పాత్ మీద మంచి నీల్ల బాటిల్ కొని సేద తీర్చుకోవాల్సిన దుస్ఠితి .. చీ చీ ఇదేం జీవితం అనుకొనే లోపే అకలి .. ఎదో హోటెల్ కనిపిస్తే తీరా వెల్లి చూస్తే అక్కడ మాంసాహరం తప్ప శాకాహరం లేదు .. మల్లి గడ్డితోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది .. అంతలోనే రాత్రి ..
కాని అక్కడ అది రాత్రి లా లేదు పట్టపగల్లా ఉంది ఎక్కడా పగటికి రాత్రి కి తేడా కనిపించలేదు నాకు .. పగలు జనాలు ఎలా ఉన్నారో రాత్రీ అదే రీతి .. ఆడే వాల్లు ఆడుతున్నారు వల్ల అటను రక్తి కట్టించడానికి కొన్నిచోట్ల నాట్య మయూరుల నృత్యం .. సొగసరుల మద్య పాన సేవలు ఇల ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వింత దృశ్యాలు .. నాకు ఇక విసుగొచ్చింది .. ఇక చూసే ఓపిక తీరిక లేదు ..
ఇక్కడ జనాలు నిద్రపోరేమో అనుకుని నకు మాత్రం నేను చక్కగా నిద్రపొయాను .. మరుసటి రోజూ ఇదే సంస్కృతి .. కస్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో అనుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా ఊరెల్లీపోదామ అనిపించింది ... నో మోర్ ట్రిప్స్ ..

విసుగొచ్చేలా రాసుంటే క్షమించండి ..
నా చిత్ర విచిత్ర అమెరికా అనుభవాలతో మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది ..
మీనాగేంద్ర

No comments: